Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి యువతిని పెళ్లి నుంచి కిడ్నాప్ చేయాలని యత్నించాడు. రాష్ట్రంలోని అశోక్ నగర్‌కి చెందిన 22 యువతిపై నిందితుడు కాలు అలియాస్ సలీం ఖాన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీడియోలతో ఆమె పరువు తీశారు. అయితే, ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరుగుతున్న సందర్భంలో కత్తితో నిందితుడు కాలు వీరంగం సృష్టించాడు. చేతిలో కత్తిని తిప్పుతూ, ముఠాతో పెళ్లి కుటుంబంపై అటాక్ చేసి, యువతిని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. యువతి తండ్రి కాలు, సోదరుడి చేయి విరగొట్టాడు. తల్లిపై దారుణంగా దాడి చేశాడు. కత్తులు, ఇనుప రాడ్లతో భయపెట్టి యువతిని పెళ్లి ఇంటి నుంచి బయటకు లాగారు.
Read Also: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల కస్టడీ.. ‘‘లైంగిక పటుత్వ పరీక్ష’’ నిర్వహించే అవకాశం..
నివేదికల ప్రకారం, బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలు, జోధా, సమీర్, షారుఖ్ మహిళ ఇంట్లోకి ప్రవేశించి వివాహ వేడుకకు అంతరాయం కలిగించారు. ఈ ముఠా కిడ్నాప్ చేస్తున్న సమయంలో యువతి ప్రతిఘటించింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు రక్షించేందుకు ప్రయత్నించిన సమయంలో వారిని కూడా వీరు కత్తులు చూపుతూ భయపెట్టారు. స్థానికుల సంఖ్య పెరగడంతో యువతిని అక్కడే వదిలి గుంపు పారిపోయారు. మహిళ కుటుంబంతో పాటు ఆమెను పెళ్లి చేసుకోబోతున్న కుటుంబానికి వీరు వార్నింగ్ ఇచ్చారు. కేసు నమోదు చేసేందుకు పోలీసులు తొలుత విముఖత చూపారు. బుధవారం అర్ధరాత్రి స్థానిక హిందూ సంస్థకు చెందిన కార్యకర్తల జోక్యం తర్వాత, మహిళ, ఆమె తండ్రి ఇద్దరు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.