మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టేందుకు నిరాకరించిందనే కోపంతో హిందూ యువతిపై ముస్లిం అత్తామామలు దాడికి పాల్పడ్డారు. తన బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టడానికి నిరాకరించినందుకు భర్త తన స్నేహితులతో తనపై అత్యాచారానికి కుట్ర పన్నినట్లు, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్‌లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసే వీడియో ఒకటి బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వార్డులో ఎలుకలు తిరుగుతున్నట్లు కనపడే వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో వైద్య సదుపాయంలో సమర్థవంతమైన పెస్ట్ కంట్రోల్‌ను ఆదేశించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో "రోగుల…
దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు.
మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కు అత్యంత కీలక బాధ్యత దక్కే దక్కనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో చౌహాన్‌ను నియమిస్తారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతుంది.
మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
Road Accident in Madhya Pradesh Today: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోధిజాద్‌లో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. Also Read: ladies Missing In…
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హృదయ విదారకమైన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో డంప్‌యార్డుకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టాడు.