మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. రక్తసంబంధుల్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. గురువారం చింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇది కూడా చదవండి: Delhi: 25 ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన డ్రైవర్..
దినేష్ సరయం అనే యువకుడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవలే మే 21న అతడికి కుటుంబ సభ్యులు వివాహం చేశారు. బుధవారం తెల్లవారుజామున బోదల్ కచర్ గ్రామంలో నూతన వధూవరులతో సహా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏమైందో ఏమో తెలియదు గానీ.. గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఎనిమిది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Israeli Airstrike On Rafah: రఫాపై ఇజ్రాయిల్ దాడి… స్పందించిన భారత్..
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నట్లుగా చెప్పారు. అయితే పెళ్లి సమయంలో మాత్రం అలాంటి లక్షణాలు కనబడలేదని తెలుస్తోంది. మానసిక సమస్యతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెబుతున్నారు. హోషంగాబాద్ జిల్లాలో పనిచేస్తున్న సమయంలో సరయం మానసిక స్థితి క్షీణించిందని.. కుటుంబసభ్యులు జోక్యం చేసుకుని చికిత్స చేయించారని చెప్పారు. అనంతరం అతనికి వివాహం చేశారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత అతని పరిస్థితి మరింత దిగజారనట్లుగా తెలుస్తోంది. ఇక ఇతడికి రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రవృత్తి కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఇక కుటుంబ సభ్యుల్ని హత మార్చిన తర్వాత.. సరయం తన మామ నివాసానికి పారిపోయాడు. అక్కడ పదేళ్ల బాలుడికి హానీ తలపెట్టే ప్రయత్నం చేస్తే.. పిల్లాడి అరుపులకు నిందితుడు పారిపోయాడు. బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన కుటుంబ సభ్యులందరికీ సామూహిక ఖననం చేశారు.
ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన బాలుడి వైద్య చికిత్స కోసం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇది కూడా చదవండి: PM Modi: కన్యాకుమారిలో ప్రధాని పర్యటన.. భగవతి అమ్మన్‌లో పూజలు