రాను రాను మనుషులలో కొంత క్రూరత్వం మరింతగా పెరిగిపోతుంది. భూమ్మీద ఎలాంటి స్వార్థం కాకుండా ఒక మనిషిని ప్రేమించగలగేది వారి తల్లి మాత్రం ఒక్కటే అని సులువుగా చెప్పవచ్చు. తల్లికి తన భర్త తోడు ఉన్న లేకున్నా తన పిల్లల్ని మాత్రం ఎంతో బాధ్యతగా పెంచి వారిని ప్రయోజకులను చేస్తుంది. కన్నతల్లి చూపించే ప్రేమ ముందర ఎన్ని కపట ప్రేమలు వచ్చిన తక్కువే. అయితే తల్లి అంత ప్రేమ చూపించిన వారి పుత్రులు మాత్రం ఆమెపై అదే…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల మహిళల ఖాతాల్లోకి ఏటా లక్ష రూపాయలను జమ చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు.
శనివారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్‌ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించగా., మరో 26 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ కు తీవ్ర గాయాలు కాగా., అతడిని సమీపంలోని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. సియోని జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియోని – మండ్లా రాష్ట్ర రహదారిపై ధనగధ…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన ఓ మహిళ భర్త మేనకోడలిని కిడ్నాప్ చేయడమే కాకుండా, ఆమెను పెళ్లి చేసుకుని లైంగికంగా వేధించింది. ఈ కేసులో సదరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్‌లో పురాతన వంతెన హఠాత్తుగా కూలిపోయింది. దీంతో పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో మంగళవారం దాదాపుగా 100 ఏళ్ల నాటి బ్రిడ్జి కూలిపోయింది.
మహిళా ఇన్స్పెక్టర్తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్ఇన్స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్‌శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.