IND vs SL: తొలి టెస్టు టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్‌కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin’s India Playing XI vs Sri Lanka 1st Test: శ్రీలంకతో శనివారం నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్‌ను వెల్లడించాడు. అయితే యాష్ జట్టులో ఊహించని మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను అశ్విన్ తుది జట్టులోకి తీసుకోకపోవడం అందరి షాక్‌కు గురిచేసింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ తిరిగి భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. దీంతో నంబర్-6 స్థానంపై ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ మధ్య పోటీ నెలకొంది. అయితే అశ్విన్ మాత్రం సర్ఫరాజ్ కంటే జురెల్నే ఎంపిక చేశాడు. ఉపఖండ పరిస్థితుల్లో సర్ఫరాజ్‌కు ఉన్న అనుభవం, స్పిన్‌ను ఎదుర్కొనే నైపుణ్యం ఉన్నప్పటికీ.. తుది జట్టులో జురెల్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు.
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌ను ఆర్ అశ్విన్ ఎంచుకున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్‌తో భర్తీ చేశాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. రిషభ్ పంత్ ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడనుండగా.. ధ్రువ్ జురెల్ ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని అశ్విన్ చెప్పాడు. పంత్, జురెల్ ఇద్దరికీ యాష్ ఒకేసారి తుది జట్టులోకి చోటిచ్చాడు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ.. తొలి టెస్టులో అతడికి చోటు ఇవ్వలేదు ఆర్ అశ్విన్. ధ్రువ్ జురెల్ ఇటీవలి ఫామ్‌పై ప్రశ్నలు ఉన్నప్పటికీ.. అతడి వికెట్ కీపింగ్ సామర్థ్యం, బ్యాటింగ్‌లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జట్టులోకి తీసుకోవచ్చని చెప్పాడు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లను స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. కుల్దీప్ యాదవ్‌ను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపిక చేశాడు. గాలే పిచ్ టెస్ట్ మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని అశ్విన్ భావించాడు.
అశ్విన్ జట్టులో బిగ్ సర్ప్రైజ్ గుర్నూర్ బ్రార్ ఎంపిక. సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా గుర్నూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ టెస్టు అరంగేట్రం చేయవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్‌తో కలిసి గుర్నూర్ కొత్త బంతిని పంచుకోనున్నాడని చెప్పాడు. వార్మప్ మ్యాచ్‌లో తన వేగం, బౌన్స్‌తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన గుర్నూర్. తొలి టెస్టులో మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని యాష్ పేర్కొన్నాడు.
అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..