Rahul Gandhi: మధ్యప్రదేశ్ మోవ్‌లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం’ ర్యాలీని సోమవారం కాంగ్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. మన రాజ్యాంగాన్ని మార్చిన రోజు దేశంలో వెనకబడిన వారికి, దళితులకు, గిరిజనులకు ఒరిగేది ఏం ఉండదని అన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వ మనదేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేవని, కేవలం ధనికలకు మాత్రమే హక్కులు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా ఇదే కోరుకుంటోందని, వారు పేదలని, దళితులను, గిరిజనులను బానిసలుగా మార్చాలని భావిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Aham Brahmasmi: మరోసారి తెరపైకి అహం బ్రహ్మస్మి మోసాలు.. ఆశ్రమంలో బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తూ..
భారతదేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని విశ్వసించేు కాంగ్రెస్ ఉంటే, మరోవైపు రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఉందని అన్నారు. రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, భారతదేశ వేల ఏళ్ల ఆలోచన అని చెప్పారు. ఇందులో అంబేద్కర్, మహాత్మా గాంధీ, బుద్ధుడు, పూలే వంటి గొప్పవాళ్ల ఆలోచనలు దాగి ఉన్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ముందు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ మాట్లాడిందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు బీజేపీ అడ్డుకున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వల్లే ప్రధాని మోడీ లోక్‌సభలో రాజ్యాంగం ముందు తలవంచాల్సి వచ్చిందని చెప్పారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కలిసి పేదలు మౌనంగా ఉండాలని, ఆకలితో చనిపోవాలని భావిస్తున్నాయి, భారతదేశాన్ని కోటీశ్వరులు నడపాలని అనుకుంటున్నారని అంబానీ-అదానీలను ప్రస్తావిస్తూ ఆరోపించారు.