Liquor Ban : మధ్యప్రదేశ్‌లో మొదటి నుండి మద్యపాన నిషేధం ఒక పెద్ద సమస్యగా ఉంది. అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు నిరంతరం మద్యపాన నిషేధం కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. 2023లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా మద్య నిషేధ అంశం వేడెక్కింది. ఎన్నికలు జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఆ రాష్ట్ర మోహన్ యాదవ్ ప్రభుత్వం శుక్రవారం నాడు రాష్ట్రంలోని 17 నగరాల్లో మొదటి దశలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఉంది.
Read Also:CM Chandrababu: ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఏపీ సీఎం..
ప్రభుత్వ నిర్ణయాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం దిశగా క్రమంగా ముందుకు సాగడానికి 17 మతపరమైన పట్టణాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తామని అన్నారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్, మెహర్ మునిసిపాలిటీ, దాటియా, పన్నా, మాండ్లా, ముల్తాయ్, మాండ్సౌర్, ఓర్చా మున్సిపల్ కౌన్సిల్, చిత్రకూట్, అమర్‌కంటక్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, మాండ్లేశ్వర్ వంటి నగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయబడతాయని సీఎం తెలిపారు. గ్రామ పంచాయతీలో సల్కాన్‌పూర్, బందక్‌పూర్, కుందల్‌పూర్, బర్మాన్ కాలా, లింగా, బర్మాన్ ఖుర్ద్ ఉన్నాయి.
Read Also:Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇక పాన్ ఇండియా ‘వెంకటలచ్చిమి’
మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం
మోహన్ యాదవ్ మంత్రివర్గ సమావేశం మహేశ్వర్‌లో జరిగింది. ఈ సమావేశంలో మద్యపాన నిషేధ నిర్ణయంపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం గురించి మీడియాకు తెలియజేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలను మూసివేయాలని నిర్ణయించిన పట్టణాలు లేదా గ్రామ పంచాయతీలలో వాటి స్థానంలో వేరే దుకాణాలు తెరవబడవని అన్నారు. అది శాశ్వతంగా మూత పడతాయని స్పష్టం చేశారు. మద్య నిషేధం ప్రకటించిన ప్రదేశాలలో ఎక్కువ భాగం మతపరమైన ప్రదేశాలేనని ముఖ్యమంత్రి అన్నారు. నర్మదా నది ఒడ్డున ఇరువైపులా 5 కి.మీ. ప్రాంతంలో మద్యపాన నిషేధ విధానం అమల్లో ఉంది. భవిష్యత్తులో కూడా దానిని కొనసాగిస్తామన్నారు. ఈ విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. రాష్ట్రం క్రమంగా మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నామన్నారు.