‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి…
‘ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పోటీ నుండి విరమించుకోవడానికి కారణం ఆయన అభిమాన దేవుడి సూచన కాద’ని నిర్మాత యలమంచి రవిచంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ”సినిమా రంగానికి చెందిన వేరే శాఖల కీలక పదవులలో ఉన్న వారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన ఉంది. ఆ కారణంగా బండ్ల గణేశ్ పోటీ నుండి విరమించుకున్నారు. కానీ ఆ నిజాన్ని చెప్పకుండా ఆయన ఏవేవో…
‘మా’ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈమేరకు ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ నెలకోంది. కాగా, ఇదివరకే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే..…
‘మా’ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీవీఎల్ నరసింహారావు సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. ఈ క్రమములోనే ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు. 2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం ప్రధానంగా ప్రస్తావించారు సీవీఎల్.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. ఈ రిజల్యూషన్ పాస్…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్ కౌర్. తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న…
ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి బరిలోకి దిగుతానని చెప్పిన బండ్ల గణేశ్… ఆ ప్యానెల్ నుండి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నిలబడటంతో కినుక వహించాడు. అంతేకాదు… ఆ ప్యానెల్ నుండి బయటకు వచ్చేసి, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. అన్నమాట ప్రకారం… సెప్టెంబర్ 27న ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు.…
టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్న అంశం ‘మా’ ఎలక్షన్స్.. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనుండగా.. గత రెండు నెలల నుంచే ‘మా’ వేడి మొదలైయింది. పోటీలో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణు ప్యానల్ కు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక నటుడు నరేష్ మాట్లాడుతూ.. మంచు విష్ణుకు పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా…
‘మా’ ఎన్నికలు ఆక్టోబర్ 10న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ‘మా’పోటీదారుల హాట్ హాట్ కామెంట్స్ తో చర్చనీయాంశంగా మారగా.. తాజాగా నటుడు నరేష్, మంచు విష్ణు పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. నరేష్ మాట్లాడుతూ.. ‘మంచు విష్ణుకి నా పూర్తి మద్దతు ఇస్తున్నాను. ఆయననే అయితేనే మాకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు. మా మసకబరింది అని కొందరు కామెంట్ చేసినప్పుడు మసక బారలేదని చెప్పాను. ఎవరు పడితే వారు ‘మా’ సీటులో కూర్చుంటే…
మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు, మరియు అతని ప్యానెల్ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీతో ఫిలిం ఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు. అనంతరం ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాట్ కామెంట్స్ చేశారు. ‘ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి..…
నటుడు మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేయగా, నేడు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్…