‘మా’ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.. మరోవైపు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీవీఎల్ నరసింహారావు సైలెంట్ గా తన పని కానిస్తున్నాడు. ఈ క్రమములోనే ఆయన మ్యానిఫెస్టో విడుదల చేశారు.
2011 లో మనం పాస్ చేసుకున్న రిజల్యూషన్ నీ పర్ఫెక్ట్ గా అమలు చేయడం ప్రధానంగా ప్రస్తావించారు సీవీఎల్.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడే 50 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాము. వాళ్ల పేర్లు త్వరలో ఎనౌన్స్ చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి వుండేలా ఆ అమౌంట్ ‘మా’ కడుతుంది. అది వచ్చే జనవరి నుంచి అమలు చేస్తాము.
ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించడం. పెన్షన్ ప్రస్తుతం 6వేలు ఇస్తున్నారు, ఈ నవంబర్ నుంచి అది 10 వేలు ఇచ్చేలా చెయ్యడం. ఆడవాళ్ళకు ఉపయోగపడే ఆసరా నీ 20 ఏళ్లు క్రితం పెట్టాము. మళ్ళీ రివైవ్ చేయడం. ఆసరా కమిటీలో వుండే 13 మంది పేర్లను త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను. ఎవరైనా మా సభ్యుడు ఆకలి బాధలు పడుతుంటే అతను కాల్ చేసినా రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజుల సరిపడా గ్రాసరి నీ పంపిస్తాము. రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు వస్తాను’ సీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.