ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ వ్యూస్ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లోనే ఎక్కువ మంది హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌ను మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ అభిమానులు హాట్…
ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగిసిపోతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారైపోయాయి. పాయింట్ల టేబుల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుసగా నాలుగు స్థానాలను ఆక్రమించాయి. ప్లే ఆఫ్స్‌లో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ ఈ నెల 24న గుజరాత్, రాజస్థాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో…
బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. కేకేఆర్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి భారీ సెంచరీ చేశాడు. బౌండరీల ద్వారానే డికాక్ 100 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వ్యక్తిగత స్కోరు విషయంలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో డికాక్ మూడో…
ఐపీఎల్‌లో మంగళవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోరే చేసినా గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. 62 పరుగుల తేడాతో లక్నోపై ఘనవిజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 63 నాటౌట్, మిల్లర్ 26, రాహుల్ తెవాటియా 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేష్…
ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘోర పరాజయం పాలైంది. పూణె వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా టీమ్ 101 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంద్రజిత్(0), ఫించ్(14), శ్రేయస్ అయ్యర్(6), నితీష్ రాణా(2), రింకూ సింగ్(6) విఫలమయ్యారు. ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లో 5 సిక్సులు, 3 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుటయ్యాడు.…
ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబై జట్టుపై భారీగా…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వన్ మ్యాన్ షో చేశాడు. 62 బంతుల్లో 103 నాటౌట్‌తో జట్టుకు…
ఐపీఎల్ 15వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు. దీంతో టోర్నీలో ఆ జట్టుకు వరుసగా ఆరో ఓటమి ఎదురైంది. శనివారం సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(13) విఫలమయ్యారు. బ్రెవిస్ (31), సూర్య కుమార్ యాదవ్ (37), తిలక్ వర్మ(26) రాణించినా భారీ స్కోర్లు…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడి 103 నాటౌట్‌తో నిలిచాడు. కేఎల్ రాహుల్‌కు డికాక్ (24), మనీష్…
ఈ ఏడాది ఐపీఎల్‌లో బలమైన జట్టుగా ముద్రపడిన ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు అన్నింట్లోనూ పరాజయం పాలైంది. ఈరోజు ఆరో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో అయినా ముంబై బోణీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. తుది జట్లు: ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్…