ఈ ఏడాది ఐపీఎల్‌లో బలమైన జట్టుగా ముద్రపడిన ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు అన్నింట్లోనూ పరాజయం పాలైంది. ఈరోజు ఆరో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుతో ముంబై తలపడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో అయినా ముంబై బోణీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తుది జట్లు:
ముంబై: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కట్, మురుగన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్.
లక్నో: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టాయినీస్, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.