ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వన్ మ్యాన్ షో చేశాడు. 62 బంతుల్లో 103 నాటౌట్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించిపెట్టాడు.
ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్‌కు ఇది రెండో సెంచరీ. ముంబై బౌలర్లలో పొలార్డ్, మెరిడిత్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, డానియల్ శామ్స్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతకుముందు ఈ మ్యాచ్ వేదిక వాంఖడే తమ అడ్డా అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమకు అచ్చొచ్చిన, బాగా తెలిసిన మైదానంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నాడు. తమ ప్రేక్షకుల మద్దతుతో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ స్టేడియంలో తమ విన్నింగ్ రికార్డు కూడా బాగానే ఉందని పేర్కొన్నాడు.
IPL 2022: ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఆ రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు