IPL 2022: ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. టోర్నీలో వరుసగా 8వ ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబై జట్టుపై భారీగా పడుతోంది. ఈ ఇద్దరు యువఆటగాళ్లు కుదరుకోకుంటే టీమిండియాలో స్థానం గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్‌ను భారీ ధరకు వేలంలో కొనుగోలు చేసిన ముంబై జట్టుకు ఒకరకంగా ఇది షాక్ అనే చెప్పాలి.
కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39, తిలక్ వర్మ 38, పొలార్డ్ 19 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు, ఆయుష్ బదోని, రవి బిష్ణోయ్, మొహ్‌సిన్ ఖాన్, హోల్డర్ ఒక్కో వికెట్ తీశారు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా 8 ఓటములను చవిచూడలేదు. ఈ చెత్త రికార్డు ముంబై ఇండియన్స్ జట్టుకే సొంతమైంది. తాజా విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ జట్టు ఖాతాలో ఐదు విజయాలు, మూడు పరాజయాలు ఉన్నాయి.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
IPL 2022: ప్లే ఆఫ్స్ వేదికలు ఖరారు.. ఆ రెండు వేదికల్లోనే మ్యాచ్‌లు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!