బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. కేకేఆర్ బౌలింగ్‌ను చీల్చి చెండాడి భారీ సెంచరీ చేశాడు. బౌండరీల ద్వారానే డికాక్ 100 పరుగులు పిండుకున్నాడు. మొత్తం 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వ్యక్తిగత స్కోరు విషయంలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో డికాక్ మూడో స్ధానానికి చేరాడు.
తొలి స్థానంలో క్రిస్ గేల్ (ఆర్సీబీ) – 175 పరుగులు నాటౌట్ ఉన్నాడు. రెండో స్థానంలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (కేకేఆర్) – 158 నాటౌట్ ఉన్నాడు. మూడో స్థానంలో క్వింటన్ డికాక్ (లక్నో) – 140 పరుగులు నాటౌట్ ఉన్నాడు. నాలుగో స్థానంలో ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ)-133 నాటౌట్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్ ) – 132 ఉన్నాడు. మరోవైపు ఐపీఎల్‌లో డికాక్‌కు ఇదే అత్యధిక స్కోరు. అంతేకాకుండా ఈ సీజన్‌లో డికాక్ కోల్‌కతాపై రెండో సెంచరీ చేశాడు. 2016 సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడిన డికాక్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ (108) ఢిల్లీపై చేశాడు. కాగా మెగావేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ.6.75కోట్లకు దక్కించుకుంది. డికాక్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 502 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు సహా, ఒక సెంచరీ ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 149గా ఉంది.