ఐపీఎల్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి మ్యాచ్‌లో వాంఖడే స్టేడియంలో విజయం సాధించి టోర్నీని ముగించాలని ప్రయత్నిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ చాలా కాలంగా ప్లేఆఫ్ రేసు నుండి దూరంగా ఉంది.
KL Rahul on LSG Defeat vs DC: పవర్ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడమే ఈ సీజన్‌లో తమను దెబ్బ కొట్టిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మంచి ఆరంభాలు ఇవ్వలేకపోవడమే పాయింట్ల పట్టికలో వెనకపడ్డానికి కారణం అని చెప్పాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 19 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో అత్యధికంగా నికోలస్ పూరన్ (61) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. చివర్లో అర్షద్ ఖాన్ (58) పరుగులతో చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లకు 209 లక్ష్యాన్ని ముందు ఉంచారు. కాగా.. ఢిల్లీ బ్యాటింగ్ లో అభిషేక్ పోరెల్ (58), ట్రిస్టన్ స్టబ్స్ (57*) పరుగులతో రాణించడంతో ఢిల్లీ భారీగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ 33 బంతుల్లో 58 పరుగులు చేయగా.. అతని…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన లక్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ విజయం ఇరు జట్లకు కీలకమైనది. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే రెండు టీమ్ లు తప్పక గెలవాల్సిన పరిస్థితి.
కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు.
Mohammed Shami Fires on LSG Owner Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కెప్టెన్‌పై కెమెరాల ముందే అరవడం సంస్కారం కాదన్నాడు. ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుందని, కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నాడు. కెప్టెన్‌తో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, మైదానం అందుకు సరైన వేదిక కాదని షమీ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు సునాయాసంగా చేధించారు. ఎస్ఆర్హెచ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. లక్నో బౌలర్లపై శివాలెత్తారు. ట్రావిస్ హెడ్ (89*), అభిషేక్ శర్మ (75*) పరుగులతో విరుచుకుపడ్డారు. కేవలం ఫోర్లు, సిక్సులతోనే లీడ్ చేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆయుష్ బడోని లక్నో జట్టుకు ఆయువు పోశాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ కూడా రాణించాడు. దీంతో.. లక్నో ఎస్ఆర్హెచ్…