Sanjiv Goenka: రాహుల్ను వదిలేసిన లక్నో.. సంజీవ్ గొయెంకాను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్..
- ఐపీఎల్ 2025లో రిటెన్షన్ జాబితాలో కేఎల్ రాహుల్‌కు చేదు అనుభవం..
- వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా జట్టు విజయం కోసం శ్రమించే వారికే ప్రాధాన్యమిచ్చాం: సంజీవ్ గొయెంకా సంజీవ్ గొయెంకా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjiv Goenka: ఐపీఎల్ 2025లో రిటెన్షన్ జాబితాలో స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కు చెదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం నిర్ణయంపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ఆ టీమ్ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ లాంటి వారిని జట్టులో కొనసాగించింది. ఐపీఎల్ రిటెన్షన్లకు ముందు ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గొయెంకా మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో మేము ఒక్కటే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం.. గెలవాలన్న లక్ష్యంతో ఉన్న వారినే ఎంపిక చేశామన్నారు. వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా టీమ్ విజయం కోసం శ్రమించే వారికే ప్రాధాన్యమిచ్చామన్నారు.
Read Also: Hyderabad Crime: చందానగర్ డ్రగ్స్ కేసు లో ట్విస్ట్ .. నిందితుడు డాక్టర్ కాదా..?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
కాగా, మా తొలి రిటెన్షన్ నిర్ణయం కేవలం రెండు నిమిషాల్లోనే తీసుకొన్నామని ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గొయెంకా తెలిపారు. మేము అన్‌క్యాప్డ్ ప్లేయర్లు మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనిని జట్టుతోనే కొనసాగిస్తున్నామన్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌ను జహీర్‌ఖాన్, జస్టిన్ లాంగర్ కలిసి పర్యవేక్షించారని పేర్కొన్నారు. గత సీజన్‌లోని ముగ్గురు భారతీయ బౌలర్లు మాకు అవసరం. పూరన్ ఎంపికలో రెండో ఆలోచన లేదని తెలిపారు. ఇక, 6, 7 స్థానాల్లో ఆయుష్ మాకు బాగా ఉపయోగపడ్డాడని చెప్పుకొచ్చారు. ఇక, వ్యక్తిగత లక్ష్యాలు అంటూ సంజీవ్ గొయెంకా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి చేసినవే అని పేర్కొంటున్నారు.
Read Also: Gun Missfire: అనంతపురం కలెక్టరేట్‌లో వెపన్ మిస్ ఫైర్!
ఇక, కేఎల్ రాహుల్ నిస్వార్థంగా టీమ్ కోసం ఆడే ప్లేయర్.. అతడిని మాత్రం వదిలేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గొయోంకా ప్లేయర్స్ తో మాట్లాడే విధానం మార్చుకోవాలంటూ మరో యూజర్ పేర్కొన్నారు. అయితే, గత ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్ తర్వాత సంజీవ్-కేఎల్ రాహుల్ మధ్య గొడవ జరిగింది. అది కాస్తా లైవ్‌లో ప్రసారమైంది. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది సంజీవ్ గొయెంకా తీరును తప్పుపట్టారు. కెప్టెన్‌తో గ్రౌండ్ లో వాదనకు దిగడం సరికాదన్నారు. ఆ తర్వాత గొయెంకా కూడా వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!