హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా ఫుల్లు స్పీడుగా దూసుకెళ్తోంది. పేరుకు మలయాళీ ముద్దుగుమ్మ అయినా తెలుగు సినిమాల్లోనే ఆమె ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవలే నాగచైతన్యతో జంటగా నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను కొల్లగొట్టింది. తద్వారా టాలీవుడ్‌కు మళ్లీ పూర్వపు వైభవాన్ని ఈ మూవీ తెచ్చిపెట్టింది. ఈ మూవీలో సాయిపల్లవి తన డ్యాన్సులతో అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. ఫిదా…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో…
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్…
నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై ఇంకా సస్పెన్స్ నెలకొంది. ప్రేక్షకులు…