శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఇంతవరకు బాగానే వున్నా ఇటీవలే అక్కినేని కుటుంబంలో సమంత వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ పార్టీలో కూడా లేకపోవడంతో మరోసారి చర్చనీయాంశంగా సమంత విడాకుల ముచ్చట్లు ముదురుతున్నాయి. సమంతకు అక్కినేని ఫ్యామిలీతో విభేదాలు వచ్చాయనే వార్తలు సందర్భం వచ్చినప్పుడల్లా గుప్పుమంటున్న.. దీనిపైనా కుటుంబసభ్యులెవరు కూడా స్పందించింది లేదు. పైగా, సమంత తన ఫ్రెండ్స్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ, విహారయాత్రలు చేస్తుంది. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా సమంత పంచుకొంటుంది.
అత్యంత ముఖ్యమైన ఈవెంట్‌లో లేకుండా ఇలా ఫ్రెండ్స్ తో సమంత చక్కర్లు కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అంతేకాదు, సమంత మాటిమాటికి అనుమానాలు వచ్చేలా ప్రవర్తిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఒకటి, రెండు సందర్భాల్లో సామ్, చైతు స్పందించిన అందులో స్పష్టత లేదని, ఒక ట్వీట్ తో పోయేదానికి ఎందుకు ఇలాంటి వార్తలతో రచ్చకెక్కుతున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.