శనివారం.. వేంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమయిన రోజు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు శనివారం ఆయన స్తోత్రపారాయణం చేయడం స్వామిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుంది.
శనివారం వేంకటేశ్వరుడికి ఎంతో ప్రీతీపాత్రమయింది. శనివారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మొదటి, రెండు, మూడు పర్యాయాలు పఠించడం ద్వారా విశేష ఫలితాలు లభిస్తాయని వేదాల్లో తెలిపారు. మన జీవితంతో ధర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శక్తి సరిపోదని, దీనిని సులభంగా తెలుసుకునేందుకు విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యులు ధర్మరాజుకు వివరించగా మహావిష్ణువు ఆమోదించారు. అందువల్ల ఎవరైతే విష్ణుసహస్ర నామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వాళ్లు భగవంతుడి సన్నిధికి చేరుతారని, ఇదే ముక్తికి మార్గం అని పండితులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు.. తిరుమలలో ఆయన పర్యటన కొనసాగనుంది.. శ్రీవారి బహ్మోత్సవాల్లో పాల్గొననున్న ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. ఇవాళ మధ్యహ్నం 2:55 గంటలకు తిరుపతి చేరుకోనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 3:30 గంటలకు బర్డ్‌లో రూ.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లలు ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు అలిపిరి నడకమార్గం, గో మందిరం ప్రారంభోత్సవంలో…