ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు.. తిరుమలలో ఆయన పర్యటన కొనసాగనుంది.. శ్రీవారి బహ్మోత్సవాల్లో పాల్గొననున్న ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. ఇవాళ మధ్యహ్నం 2:55 గంటలకు తిరుపతి చేరుకోనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 3:30 గంటలకు బర్డ్‌లో రూ.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన చిన్న పిల్లలు ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు అలిపిరి నడకమార్గం, గో మందిరం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకోనున్న సీఎం జగన్.. సాయంత్రం 5:50 బేడీ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని.. 6:05 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఉరేగింపులో బయల్దేరి.. సాయంత్రం 6:20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు.
ఇక, సాయంత్రం 6:50 గంటలకు 2022 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్.. 7:00 గంటలకు గరుడ వాహన సేవలో పాల్గొననున్న ఆయన.. 7:05 గంటలకు పద్మావతి అతిథి గృహానికి తిరుగు ప్రయాణం అవుతారు.. ఇక, మంగళవారం ఉదయం 5:30 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్నారు సీఎం.. ఉదయం 6:25 గంటలకు కర్నాటక సీఎం బోమ్మైతో కలసి ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.. 6:50 గంటలకు బూందీ పోటు ప్రారంభం.. తర్వాత 7 గంటలకు అన్నమయ్య భవనానికి చేరుకోనున్న సీఎం.. ఇటీవల టీటీడీ తీసుకున్న నిర్ణయాలు పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ వీక్షించనున్నారు.. టీటీడీ, రైతు సాధికారిక సంస్థ మధ్య ఎంఓయూ పై సంతకాలు కార్యక్రమం జరగనుండదా.. 8 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్న సీఎం.. ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక, సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.