జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (గురువారం) పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్‌పూర్, భదోహి, ప్రతాప్‌గఢ్‌లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను సాధారణ పౌరులకు చూపించారని ఆమె ఆరోపణలు చేశారు.
పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే స్కాంగ్రెస్ హస్తం అంతు తేలుద్దామని ఇవాళ (ఆదివారం) బీజేపీ పార్టీ భస్మాసుర హస్తం అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దొంగే దొంగా దొంగా అంటూ అరిచినట్లు ఉంది కమలం పార్టీ తీరు చూస్తుంటే అని విమర్శలు కురిపించింది.
సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన మీరు ఒడియాకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు అని సీఎం నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఉన్నప్పటికీ ఒడియాను మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఒడిస్సీ మ్యూజిక్ కు క్లాసికల్ హోదా కోసం తాను రెండు సార్లు ప్రతిపాదనలు పంపినప్పటికి వాటిని పట్టించుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అనేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.