PM Modi Election Campaign: నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్‌పూర్, భదోహి, ప్రతాప్‌గఢ్‌లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్‌పూర్ బరాగావ్ ఫరియాలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. అనంతరం జౌన్‌పూర్‌లోని టీడీ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు భదోహిలోని ఉంజ్ గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, చివరగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రతాప్‌గఢ్‌లోని జీఐసీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మాట్లాడనున్నారు.
Read Also: RR vs PBKS: రాజస్థాన్పై పంజాబ్ గెలుపు..
అలాగే, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీలోని బండలో మధ్యాహ్నం 12:40 గంటలకు హిందూ ఇంటర్ కాలేజ్, అటార్రా మైదానంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఫతేపూర్‌లోని ముస్లిం ఇంటర్ కళాశాలలోని గ్రౌండ్ లో 3:10 గంటలకు కౌశాంబిలోని నియామత్‌పూర్ సిరతులో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో అఖిలేష్ ప్రసంగిస్తారు. దీంతో పాటు ఫతేపూర్‌లోని ఖాగాలో ఉన్న నవీన్ మండిలో ఏర్పాటు బీఎస్పీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాయావతి పాల్గొననున్నారు.
Read Also: Off The Record: తెలంగాణ ఎంపీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ కంగారు..
ఇక, నేడు ఢిల్లీలోని ఎస్పీ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్‌లు కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడనున్నారు. అలాగే, ఉదయం 11 గంటలకు శ్రావస్తిలో జరిగే ఇండియా కూటమి ఉమ్మడి సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండేతో కలిసి పాల్గొంటారు.