Lokshabha Elections 2024: నేడు ఆరో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్.. బరిలో ప్రముఖులు వీరే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokshabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా, ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. బీహార్ లో8, హర్యానా 10, జమ్ముకశ్మీర్ లో 1, ఝర్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్ లో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. కాగా, వీటితో పాటు ఒడిశా అసెంబ్లీలో 42 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
Read Also: Lokshabha Elections 2024: నేడు లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్.. లైవ్ అప్ డేట్స్
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇక, ఈ ఆరో దశలో ఎన్నికల బరిలో సంబల్పూర్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (కర్నాల్), దీపేందర్ హుడా (రోహ్‌తక్), మేనకాగాంధీ (సుల్తాన్‌పూర్), పీడీపీ చీఫ్ మెహబూబా ముస్తీ (అనంతనాగ్- రాజౌరీ), నవీన్ జిందాల్ (కరుక్షేత్ర), కన్నయ్య కుమార్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), రావు ఇందరితీసింగ్ (గురుగ్రామ్), బన్సూరి స్వరాజ్ (ఢిల్లీ) నుంచి పోటీ చేస్తున్నారు.
Read Also: Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవదహనం.. ఆరుగురికి గాయాలు
అయితే, ఈ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలనూ గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలనూ బీజేపీ గెలుచుకోగా.. అక్కడ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ట్రై చేస్తుంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో ఆప్ పోటీ చేస్తుంది. ఇక, ఇండియా కూటమి నుంచి ఎన్డీయేకి గట్టి పోటీ ఇస్తుంది. కాగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 543లో 428 స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ దశ ఎన్నికలు కూడా అయిపోతే.. మొత్తం 486 స్థానాలకు పోలింగ్ పూర్తైనట్లు. ఏడో దశలో 57 స్థానాలకు పోలింగ్ కొనసాగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజున ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణలోని కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం కూడా రానుంది. అలాగే, జూన్ 6వ తేదీన ఎన్నికల కోడ్ ముగియనుంది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!