స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా తీర్పును కళ్లారా చూశామని, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని ఆయన మర్యాద పూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి మినహాయించి అన్ని చోట్లా గెలిచామన్నారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలకు సంకేతాలుగా భావించాలన్నారు. గత ఎన్నికల్లో కొడుకు మంగళగిరిలో ఓడిపోతే.. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఓటమి పాలయ్యారన్నారు. ఈ ఫలితాలను చంద్రబాబు అర్థం చేసుకోవాలని విజయసాయిరెడ్డి…
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు…
రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా రైతులను వాడుతున్నారని మం త్రి పేర్ని నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతుల పాదయాత్ర, చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయాత్రకు చేసిన పాపాలకు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుని ఉంటే బాగుండేదని మంత్రి అన్నారు. చంద్రబాబు తాబే దార్లు న్యాయమూర్తులకు కళ్లకు గంతలు కట్టి యాత్ర చేస్తున్నారన్నా రు. పాదయాత్రకు…
అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన..…
మా ప్రభుత్వంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదని, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా అనేది రాష్ట్ర బీజేపీ చెప్పాలన్నారు. రూ. 3.20లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటుందని, దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందన్నారు. మీరు నామమాత్రం తగ్గించి రాష్ట్రాలు తగ్గించాలి…
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో లోకేష్, చంద్రబాబు సిద్ధహస్తులు అని మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు లాంటి మా పాత మిత్రులు వారి తత్వాన్ని గమనించాలని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్షించేందుకు విశాఖకు వచ్చిన లోకేష్.. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు.…
టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ అనే పొట్టేలును ఏపుగా మేపి రాష్ట్రం మీదకు చంద్రబాబు వదిలాడని చురకలు అంటించారు. ప్రజలు..చూసి, చూసి ఏదో ఒక రోజు ఆ పొట్టేలు కొమ్ములు వంచుతారని ఎద్దేవా చేశారు. “లోకేశ్ అనే పొట్టేలుని ఏపుగా మేపి రాష్ట్రం మీదకు వదిలాడు బాబు. కొమ్ముల దురదతో దారిన పోయే వారందరిని కుమ్మాలని చూస్తున్నాడు. చూసి చూసి ఎన్నడో కొమ్ములు…
టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని.. వారు కరువుకు మారు పేరు అని చురకలు అంటించారు. “తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి. గడచిన రెండేళ్లలాగే ఈ…
చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత…
ప్రభుత్వాన్నీ అస్థిరపరచడం,బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యం అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో లోకేష్ పర్యటనలో కరోనాతో మరణించిన పార్టీ నాయకులు కుటుంబాల పరామర్శ కోసం అని భావించాం. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి పరామర్శ పేరుతో వచ్చిన లోకేష్… రాజకీయం మాట్లాడి వెళ్లారు. లోకేష్ కు చరిత్ర తెలియదు… టీడీపీ హయాంలోనే కారంచేడులో దళితుల్ని ఊచకోత కోశారు. దళితుల గురించి మాట్లాడే హక్కు లోకేష్, చంద్రబాబుకి లేదు. టీడీపీ అన్ని వర్గాలను దూరం చేసుకున్నందుకే జగన్మోహన్…