ఏపీలో పొలిటికల్ టార్గెట్స్ పర్సనల్ అయ్యాయి. ఎంత తిడితే అంత ఫాలోయింగ్ అన్నట్టుగా నేతలు తయారయ్యారు. పొలిటికల్ విమర్శలు సాధారణమే అయినా.. ఈ మధ్య అధికార ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారితోపాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారు సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఒంటికాలిపై లేచిన సందర్భాలు అనేకం. ఘాటైన విమర్శలే గుప్పిస్తున్నారు. దీన్ని టీడీపీ…
కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత గర్జనకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అనుమతి నిరాకరించిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే వర్మను టీడీపీ ఆఫీస్ లోనే నిర్బంధించారు పోలీసులు. దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాళాలు పగలగొట్టి వర్మను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో టీడీపీ క్యాడర్ వాగ్వాదానికి దిగింది. టీడీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం పిఠాపురంలో టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మని ఇంటికి తీసుకుని…
ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు. మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి.…
ఒంగోలులో నిర్వహించిన తెలుగుదేశం మహానాడు టీడీపీలో జోష్ నింపింది. అయితే పార్టీలో అక్కడక్కడ ధిక్కారంతో వున్న నేతలకు చంద్రబాబు క్లాస్ పీకారు. మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వరుస సమావేశాలకు నిర్ణయం తీసుకున్నారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే సమీక్షలు ప్రారంభించిన చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల…
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనం కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం అనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి వై.సి.పి ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1983లో నెల్లూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగానే అనం రామనారాయణ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014 వరకూ కాంగ్రెస్ లో ఉన్న ఆనం..అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో టిడిపిలో చేరారు. చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇస్తారని భావించారు. కానీ ఏ పదవి కూడా ఇవ్వకపోవడం..కీలక సమావేశాలకు ఆహ్వానించక పోవడంతో కినుకు…
తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదు.ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారు.మనకు జనాలు ఉన్నారు.. వారికి బస్సులున్నాయి.అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. మహానాడు వాహానాలకు గాలి తీసేస్తున్నారు.ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.జగనుకు ఈ రోజు పిచ్చెక్కుతుంది.జగనుకు ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ…
ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…