ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు.
చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే చూపించండి. చంద్రబాబుది జిత్తులమారి స్వభావం. కుప్పం నియోజకవర్గంలో కూడా గెలవలేని దుస్థితి టీడీపీకి వచ్చింది. అయినా మా మీద గుడ్డకాల్చి మాముఖాన వేసే ధోరణి కనిపిస్తోంది. భువనేశ్వరి గారికి కూడా చెబుతున్నాం. భువనేశ్వరీ తండ్రికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ భార్య పేరును కూడా వాడుకుని రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నాడు. పార్టీని ప్రజలు తిరస్కరించారు కనుక సింపథీ కోసం ప్రయత్నిస్తున్నాడన్నారు అంబటి.