ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబు, లోకేష్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి జగన్ కాదని…చంద్రబాబుకు లోకేష్ శత్రువని ఎద్దేవా చేశారు. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఎదగదని….మనుషులను వాడుకుని వదిలేయడంలో లోకేష్, చంద్రబాబు సిద్ధహస్తులు అని మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు లాంటి మా పాత మిత్రులు వారి తత్వాన్ని గమనించాలని పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్షించేందుకు విశాఖకు వచ్చిన లోకేష్.. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడారని ఫైర్ అయ్యారు. కరోనాతో మృతి చెందిన టీడీపీ నాయకులను పరామర్శించడానికి కూడా వెళ్ల లేదని చురకలు అంటించారు. విశాఖలో టిడిపి నేతలే కబ్జాలు చేశారని మండిపడ్డారు.