మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు హయాంలో ప్రాధాన్యత ఉన్న కీలక పనులేవీ చేయలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్లకు బాగా మిగిలే పనులు మాత్రమే చేశారు. వైసీపీ ప్రభుత్వం కీలకమైన పనులే టేకప్ చేశాం. రెండు సార్లు కోవిడ్ వచ్చినా పనులు ఆగకుండా చిత్తశుద్ధితో పని చేశాం అన్నారు అంబటి. ఈ జలయజ్ఞాన్ని వైఎస్సార్ ప్రారంభించారు.. ఆగే ప్రసక్తే లేదు. మేము అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో 6…
తెలుగు జాతి ఆత్మగౌరవ జెండాని ఢిల్లీ వీధుల్లో ఎగురేశారు స్వర్గీయ నందమూరి తారకరామారావు. నేడు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. 1982 మార్చి 29న హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ ప్రారంభించారు వెండితెర వేలుపు ఎన్టీఆర్. తెలుగుదేశం 40ఏళ్ల ప్రస్థానం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అధినేత చంద్రబాబు.అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోంది గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాల్లోకి విసిరేశారు టీడీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్…
రాసిపెట్టుకొండి వైఎస్ జగన్‌ను ఓడించడం చంద్రబాబు, లోకేష్ సహా ఎవరి తరం కాదని జోస్యం చెప్పారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్నాయుడు త్వరగా ఎన్నికలొచ్చేయాలి…అధికారంలోకి వచ్చేయాలని తపన పడుతున్నారని సెటైర్లు వేశారు. మా ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయ్యింది.. ఉప ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్ని ఎన్నికలనూ ఎదుర్కొన్నాం.. ఒక్క ఎన్నికలోనైనా టీడీపీకి సింగిల్ డిజిట్ వచ్చిందా? అని ప్రశ్నించారు.. అన్నం తినేటప్పుడు ఎవడూ…
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అయితే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షులు నాయకులు అచ్చెన్నాయుడు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆస్కార్ అవార్డకు మించి నటించారని ఆయన అన్నారు. జగన్‌రెడ్డికి మోసకార్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ లోపాయికారితనం, చేతకానితనం మరోసారి బహిర్గతమైందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చనప్పుడు ప్రజలిచ్చిన పదవుల్లో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. సీఎం,…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడి ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో తొమ్మిదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.బయటకు రాలేకే మృతిచెందారు. ప్రమాదంలో వెంటనే…
మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాగురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? చంద్రబాబు మహా నటుడు. చంద్రబాబు లాంటి…
ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే…