మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడిపై మరోమారు ఫైర్ అయ్యారు మంత్రి కొడాలి నాని. లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నాగురించి వంశీ, జగన్ కుటుంబ సభ్యులపై టీడీపీ ఆఫీసు నుండి లోకేష్ చేసి పోస్టింగ్ ల పై వాళ్ళను ఏం చేయాలి? వంశీ చేసిన వ్యాఖ్యలు తన సొంతానివి కావు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలవి. రాజకీయాల కోసం పెళ్ళాన్ని కూడా వాడుకుంటారా? చంద్రబాబు మహా నటుడు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడితేనే అర్థం అవుతుంది. తాటి చెట్టుకు కూడా వయసు ఉంటుంది..విలువ ఇస్తామా? 74 ఏళ్ల వయసు వస్తే సరిపోతుందా? అన్నారు నాని.
చిన్న వయసులో ఉన్న జగన్ ను గాల్లో వస్తాడు… గాల్లో పోతాడు అనవచ్చా? జగన్ పోరాటయోధుడు. చంద్రబాబు ఒక బిచ్చగాడు, 420…అతను నాకు, వంశీకి రాజకీయ భిక్ష పెట్టడం ఏంటి? గుడివాడ నియోజకవర్గ ప్రజలు నాకు రాజకీయ భిక్ష పెట్టారని విమర్శించారు కొడాలి నాని. అక్టోబర్ 22న వంశీ ఆన్ రికార్డ్ వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు 28 రోజుల తర్వాత ఏడ్వటానికి కారణం ఏంటో చెప్పాలి? తన ప్రణాళిక అమలు చేయటానికి అసెంబ్లీని చంద్రబాబు వేదిక చేసుకున్నారని విమర్శించారు నాని. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవ్. లక్ష్మీపార్వతిని బూతుగా చూపించి వెళ్లగొట్టే కుట్ర చేసింది చంద్రబాబు కాదా అని నాని ప్రశ్నించారు.
చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్, ఎన్టీ రామారావు కాదా? వాళ్ళిద్దరిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. లోకేష్ ను మంగళగిరి లో ఓడించింది చంద్రబాబు. ముఖ్యమంత్రి పదవి కి పోటీకి వస్తాడనే ఓడించాడు. గుడివాడలో కమ్మ మీటింగ్ పెడతా… దమ్ము ఉంటే అరికెపూడి గాంధీ, మల్లాది వంశీ రావాలి. ప్రజలు ఎవరి గుడ్డలూడదీసి కొడతారో చూద్దాం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కొడాలి నాని.