Lok Sabha: మహారాష్ట్రలో రెండు రాజకీయ కూటల మధ్య పొత్తుల పోరు కొనసాగుతుంది. ఒకవైపు అధికార బీజేపీ-శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ వర్గం)ల కూటమి ఉండగా.. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్-శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ వర్గం)ల కూటమిలు ఉంది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇరు కూటములలోని భాగస్వామ్య పార్టీలు సీట్ల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. మహావికాస్ అఘాడీల గొడవ బహిరంగంగా కొనసాగుతుండగా.. అధికార కూటమి మధ్య మాత్రం అంతర్గత పోరు కొనసాగుతుంది.
Read Also: YS Subba Reddy: కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల.. ఇలా స్పందించిన వైవీ సుబ్బారెడ్డి
అయితే, అధికార కూటమిలో బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది. అంటే 25 కంటే ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని కమలం పార్టీ భావిస్తోంది. దీని కోసం శివసేన (షిండే) యొక్క కొన్ని స్థానాలపై బీజేపీ కన్నేసింది. మరోవైపు, శివసేన (షిండే) 2019లో తాము పోటీ చేసిన స్థానాల్లోనే మూడు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించగా.. బీజేపీ, ఎన్సీపీ నేతలు మాత్రం సీట్ల షేరింగ్ ఫార్ములా ఖరారు కాలేదని పేర్కొన్నారు. ఇక, 2019లో శివసేన ఆధీనంలో ఉన్న కనీసం ఆరు స్థానాల్లో పోటీ చేయాలని కమలం పార్టీ అనుకుంటుంది. వాటిలో ఒకటి ముంబై సౌత్ నియోజకవర్గం.
Read Also: Kunamneni: పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్ ని కోరిన సీపీఐ
ఇక, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన, ఎన్సీపీ కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో వివాదం నెలకొంది. 2019లో శివసేనకు చెందిన శ్రీరంగ్ బర్నే ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్‌ను ఓడించి మావల్ లోక్‌సభ నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన బర్నే మరోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఆశించారు. కాగా, ఎన్‌సీపీ, బీజేపీ స్థానిక నాయకత్వం ఈ సీటును బహిరంగంగా ప్రకటించడంతో ఆయా పార్టీలపై ఒత్తిడి తీసుకు వస్తుంది.