క్యాష్ ఫర్ క్వరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫారసు చేసిన ఎథిక్స్ కమిటీ నివేదిక ఇవాళ లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ నెల 4న ఈ అంశాన్ని అజెండాలో ఉంచినా చర్చించలేదు.. మొయిత్రా సస్పెన్షన్ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకొనే ముందు చర్చ జరపాలని పలువురు విపక్ష సభ్యులు కోరుతున్నారు. ఎథిక్స్ కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికకు అనుకూలంగా ఓటు వేశారు. విపక్షాలకు చెందిన నలుగురు సభ్యులు అసమ్మతి నోట్‌ను అందించారు. ఈ రిపోర్ట్ ను విపక్ష సభ్యులు ‘ఫిక్స్‌డ్ మ్యాచ్’గా పేర్కొంటున్నారు. ఆరోపణలకు మద్దతుగా చిన్న ఆధారం కూడా లేదు అని వారన్నారు. అయితే, ప్యానెల్ సిఫార్సుకు అనుకూలంగా సభ ఓటేస్తేనే మహువా మొయిత్రా లోక్ సభ నుంచి బహిష్కరణకు గురౌతుంది.
Read Also: Prabhas: పాన్ ఇండియా హీరోకి అదిరిపోయే విలన్ కటౌట్…
అయితే, కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే మహువా మెయిత్రాపై వేటు వేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ, మహువా అంశం, కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరపకుండా చర్యలు తీసుకుంటే ఊరుకునేది లేదని విపక్షాలు అంటున్నాయి. ఇక, లోక్‌సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బు తీసుకున్నారనేది మెయిత్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని ఆదేశాల మేరకు.. అదానీ గ్రూప్‌పై ప్రశ్నలు వేశారంటూ లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కంప్లైంట్ చేయడంతో ఇది తెరపైకి వచ్చింది. దీంతో ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫార్సు చేయడంతో.. పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదికను ఇవాళ లోక్‌సభలో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఒకవేళ సభ ఆమోదిస్తే ఎంపీ సభ్యత్వాన్ని మహువా మొయిత్రా కోల్పోనున్నారు.