ఏపీలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వైసీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరింది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించారు.
Read Also: Diabetes Care : మధుమేహం నియంత్రణలో లేకుంటే ఇది ట్రై చేయండి
కాగా, ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీని రాజ్యసభలో ఖాళీ చేశాం.. త్వరలో లోక్ సభ, శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మా పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వస్తున్నారు అని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదు అని ఆయన చెప్పారు. సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుంది అన్నారు. ప్రజాబలం ముందు ప్రలోభాలు పని చేయవని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.