Congress- AAP: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, గోవా, చండీగఢ్‌లలో సీట్ షేరింగ్‌కు రెండు పార్టీలు ఓకే చెప్పుకున్నాయి. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్, ఆప్ నేత సందీప్ పాఠక్‌లు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. ఢిల్లీలోని 7 సీట్లకు గాను.. కాంగ్రెస్ 3, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీలో ఆప్ పోటీ చేస్తుండగా.. చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ స్థానాల్లో కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. ఇక, గుజరాత్‌లోని భరూచ్, భావ్‌నగర్‌లలో కేజ్రీవాల్ పార్టీ పోటీ చేయనుండగా, మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది.
Read Also: Queen 2 : ‘క్వీన్’ సీక్వెల్‌కు కథ సిద్ధం..సీక్వెల్ లో కంగనా నటిస్తుందా..?
అలాగే, హర్యానాలో 10 స్థానాల్లో ఒక స్థానాన్ని(కురుక్షేత్ర) ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. గోవాలో ఉన్న రెండు స్థానాలు, చండీగఢ్‌లోని ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసేందుకు బరిలోకి దిగుతుంది. సుధీర్ఘ చర్చల అనంతరం సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్- ఆప్ పార్టీలు తుది నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఐదు రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటించిన ఇరు పార్టీలు పంజాబ్‌పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఇరు పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతాయని గతంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
Read Also: Uttar Pradesh: వామ్మో దాని కోసం ఏకంగా యూపీ హైకోర్టును ఆశ్రయించిన ఐదేళ్ల పిల్లాడు..
పంజాబ్ రాష్ట్రంలో 13 లోక్ సభ స్థానాలుండగా అక్కడ ఆప్ అధికారంలో ఉంది. ఇప్పటికే యూపీలోనూ సీట్ షేరింగ్‌పై క్లారిటీ రావడంతో పాటు తాజాగా కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదరడంతో ఇండియా కూటమికి కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్- శివసేన (యూబీటీ) మధ్య ఎనిమిది సీట్లపై ఇంకా నిర్ణయంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడ కూడా చర్చలు దాదాపు ముగిశాయి.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.