BJP: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు పొత్తులపై సమాలోచనలో చేస్తూనే.. మరో వైపు అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం.. తమకు ఏ సీట్లు కావాలి అనేదానిపై ఇప్పటికే టీడీపీ-జనసేన ముందు ప్రతిపాదనలు పెట్టింది బీజేపీ అధిష్టానం.. ఈ రోజు టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు, సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండగా.. మరోవైపు.. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థుల ఖరారులో తన సొంత ముద్ర ఉండేలా బీజేపీ హైకమాండ్ చూసుకుంటుందట..
Read Also: Congress : ఎన్నికల ముందు కాంగ్రెస్ కు షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నేత
దీంతో, తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్ల కేటాయింపులో సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది.. బీజేపీ కోసం పని చేసిన వారికి.. టీడీపీ ముద్ర లేని వారికి ప్రయార్టీ ఇచ్చే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది.. తప్పదనుకుంటేనే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ పరిణామాలతో టిక్కెట్లు ఆశిస్తున్న ప్రముఖులకు సైతం మొండి చేయి చూపే ఛాన్స్ ఉందంటున్నారు.. సామాజిక సమీకరణాలు.. గెలుపు ప్రతిపాదికనే టిక్కెట్ల కేటాయించాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశీస్సులున్నవారికి టిక్కెట్లు దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. కాగా, రాష్ట్రంలో కనీసం 8 లోక్‌సభ స్థానాల్లోనైనా పోటీ చేసే విధంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే, సీట్ల సంఖ్య, ఏఏ స్థానాలు అనేదానిపై ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.