KTR: పిరమైన ప్రధాని @narendramodi గారు.. మీరు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. యావత్ తెలంగాణ సమాజం పక్షాన కొన్ని ప్రశ్నలు అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొన్ని ప్రశ్నలను సంధించారు.
Holiday: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది.
లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ నేడు జరగనుంది. ఈ దశలో, 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రజలు నమోదు చేయనున్నారు. ఈ దశలో 1351 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా.. వారిలో 120 మంది మహిళలు ఉన్నారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టు రామమందిర తీర్పును రద్దు చేస్తానని రాహుల్ గాంధీ శపథం చేశాడని ఆయన సోమవారం అన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో 'లోక్‌సభ ఎన్నికల'లో జరిగే అతిపెద్ద పండుగను చూసేందుకు 23 దేశాల ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇండియాకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, "మా ఆహ్వానం మేరకు, 23 దేశాల నుండి ఎన్నికల నిర్వహణ సంస్థలతో సంబంధం ఉన్న 75 మంది అంతర్జాతీయ ప్రతినిధులు మా ఎన్నికలను చూసేందుకు ఇక్కడకు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అనలేదని.. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని మాత్రమే అన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు.
దునెలల్లో తెలంగాణ ఎందుకు ఆగమైంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెప్పపాటు కరెంట్ పోలేదు.. ఇప్పుడెందుకు కరెంట్ కోతలు విధిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
జన్మంతా ఈ ప్రాంతానికి సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. "గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. ఢిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ ను ఓడించలేరు.
తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టారు.