Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని అనలేదని.. శాస్త్రీయంగా జిల్లాల ఏర్పాటు జరగలేదని మాత్రమే అన్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. పేదల పక్షాన పోరాటం చేసే పార్టీ సీపీఎం పార్టీ అని తెలిపారు. దేశాన్ని మతం, కులం, ప్రాంతం పరంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ సీపీఎం పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. అందరి సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కేసీఆర్.. బీజేపీకి 200 సీట్లు దాటవని అంటుూనే బీజేపీ మద్దతు ఇస్తు్న్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు పెట్టుబడిదారులకు, పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధం అని చెప్పారు. ఇండియా కూటమిలో అనేక మంది దేశ భక్తులు ఉన్నారని వివరించారు. భారత దేశం భిన్న కులాలకు, మతాలకు నిలయం అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని.. రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Congress: ఉగ్రవాది కసబ్, ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేని చంపలేదట.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు వివాదాస్పదం..
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Ananya Pandey: ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..