నేడు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smriti Irani) తన సొంత నియోజకవర్గంలో వారం రోజులుగా మకాం వేశారు. పలు కార్యక్రమాలతో బిజిబిజీగా ఉంటున్నారు.
Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సరికొత్త పొత్తు పొడవబోతోంది. అధికార డీఎంకే పార్టీతో కమల్ హాసన్‌కి చెందిన ‘మక్కల్ నీది మయ్యం’ పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పొత్తుపై ప్రకటన వెలువడుతుందని సోమవారం కమల్ హాసన్ తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
JP Nadda: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడగింపుపై బీజేపీ జాతీయ మండిలి ఆమోదం తెలిపింది. జూన్, 2024 వరకు ఆయన పదవినీ పొడగించారు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు జేపీ నడ్డా నాయకత్వాన్ని బీజేపీ పెంచుతూ వస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరిలో ప్రకటించిన ఈ నిర్ణయానికి ఆదివారం పార్టీ జాతీయ కౌన్సిల్ ఆమోదం లభించింది. అంతేకాకుండా పార్లమెంటరీ బోర్డు ఆమోదానికి లోబడి స్వతంత్రంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని జేపీ నడ్డాకు…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే…
ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులకు 100 కోట్ల రూపాయలు.. క్రైస్తవ సమాజానికి 200 కోట్ల రూపాయల కేటాయించారు.
P Chidambram: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ పీ.చిదంబరం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ ప్రభుత్వం ఏదైనా అమలు చేయాలంటే చాలా బాగా చేస్తుందన్నారు.