ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
మెదక్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…
Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలో రాజకీయంగా ఉద్రిక్తతతలకు కారణమవుతోంది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, రాహుల్ గాంధీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
భారత్ లో మరో రెండు నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక, ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) నాయకులు ఇవాళ వర్చువల్ గా కీలక సమావేశం కానున్నారు.
Parliament's Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు వేళైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత సెషన్ ప్రారంభమవుతుంది.
Lok Sabha elections: లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. దీంతో బీజేపీ ఎన్నికల మోడ్‌లోకి వెళ్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోడీ శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 13 నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ లోని బెట్టియా నగరంలోని రామన్ మైదాన్‌లో ఆయన బహిరంగ సభకు హాజరుకాబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలోనే ప్రధాని బీహార్ లోని రోడ్లు, వంతెనలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు.
Vinod Kumar: ఇంటిపేరు ఓకే విధంగా ఉంటే చుట్టాలుగా పరిగణించడం అనేది ఏ సంస్కృతి? అని బీజేపీ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. చుట్టాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి రికమండేషన్ చేసినానని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.