ఇండియా కూటమికి (INDIA Bloc) సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) షాక్‌లు షాక్‌లు ఇస్తున్నారు. గతంలోనే కాంగ్రెస్‌ను (Congress) సంప్రదించకుండా 16 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. తాజాగా మరోసారి కూటమికి షాకిస్తూ మరో 11 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఓ వైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర యూపీలో కొనసాగుతుండగానే అఖిలేష్ ఈ ప్రకటన చేయడం కూటమి సభ్యులను కలవర పెడుతోంది.
11 మందితో కూడిన లోక్‌సభ అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఈ లిస్టులో ముఖ్తార్ అన్సారీ సోదరుడు అఫ్జల్ అన్సారీని రంగంలోకి దింపారు. గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న అఫ్జల్‌ను ఘాజీపూర్ నుంచి ఎస్పీ బరిలోకి దింపింది. గతంలో ఓ హత్య కేసులో అఫ్జల్‌కు జైలు శిక్షకు పడింది. అయినా కూడా అఫ్జల్‌కు అఖిలేష్ సీటు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ముజఫర్‌నగర్ నుంచి హరేంద్ర మాలిక్, హర్దోయ్ నుంచి ఉషా వర్మ, షాజహాన్‌పూర్ నుంచి రాజేష్ కశ్యప్‌లను ఎస్పీ రంగంలోకి దించింది.
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు ఎస్పీ మిత్రపక్షం. కానీ ఎలాంటి సంప్రదింపులు లేకుండానే అఖిలేష్ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ యాత్రలో పాల్గొనడం లేదని అఖిలేష్ ప్రకటించారు. సీట్లు పంపకాలు జరగలేదు కాబట్టే యాత్రలో పాల్గొనలేదని తెలిపారు.
— Samajwadi Party (@samajwadiparty) February 19, 2024