Karnataka Budget 2024: వక్స్ బోర్డుకు 100 కోట్లు, క్రిస్టియన్లకు 200 కోట్లు.. హిందూ దేవాలయాలకు ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Siddaramaiah: ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులకు 100 కోట్ల రూపాయలు.. క్రైస్తవ సమాజానికి 200 కోట్ల రూపాయల కేటాయించగా.. హిందూ దేవాలయలకు వెళ్లే యాత్రా స్థలాల అభివృద్ధికి మాత్రం కేవలం 20 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు.
Read Also: Naresh Goyal : క్యాన్సర్ బారిన జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు.. బెయిల్ కోరుతూ కోర్టులో పిటీషన్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అయితే, రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత సీఎం, ఆర్థిక మంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ సంవత్సరం 7.50 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 50 సంజీవని కేఫ్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ కేఫ్ లు మహిళలచే నిర్వహించబడుతుందన్నారు.. ఈ క్యాంటీన్లు పరిశుభ్రమైన, ఆరోగ్యాన్ని అందిచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సాంప్రదాయ ఆహారాన్ని అందిస్తుంది అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
Read Also: Vizag: ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. ఘాటు విమర్శలు.. పోలీసులకు ఫిర్యాదు..
కాగా, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని అమలు చేస్తున్నప్పుడు 14 శాతం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఒకవేళ ఆదాయ వృద్ధి తగ్గితే.. రాష్ట్రాలు నష్టపరిహారం పొందుతాయి అనే విషయాన్ని పేర్కొన్నారు. అంచనా ప్రకారం, 14 శాతం వృద్ధి రేటుతో 2017 నుంచి 2023-24 వరకు GST పన్ను వసూళ్లు రూ. 4, 92, 296 కోట్లుగా అంచనా వేయగా.. కేవలం రూ. 3,26,764 కోట్ల GST ఆదాయం మాత్రమే రాష్ట్రానికి సమకూరింది అని తెలిపారు. అలాగే, జీఎస్టీ లోటుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం రూ.1,06,258 కోట్లు మాత్రమే పరిహారంగా తిరిగి ఇచ్చిందన్నారు. గత ఏడేళ్లలో జీఎస్టీ వ్యవస్థను తప్పుగా నిర్వహించడం వల్ల కర్ణాటక రాష్ట్రం రూ.59,274 కోట్ల నష్టాన్ని చవిచూసింది అని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
Karnataka CM and Finance Minister Siddaramaiah says, "50 women-run cafes with the name of Cafe Sanjeevini will be launched across the State during this year for Rs 7.50 crore. These canteens will cater to the demand and supply gap in rural areas for healthy, hygienic and… https://t.co/1pYQB4dVxl
— ANI (@ANI) February 16, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..