Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు సమయం ఎక్కువ లేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం చకచక పనులను పూర్తి చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై అధికారులు పర్యటనలు నిర్వహించారు. ఈ నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ తొలి విడతగా 195 ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక ప్రధాన ప్రతిపక్షం…
Lok Sabha Election : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం (మార్చి 2) లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయడం ప్రారంభించింది.
Priyanka Gandhi : డామన్ డయ్యూ కాంగ్రెస్ అధ్యక్షుడు కేతన్ పటేల్ ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్ని్కల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. హిందూపురం నుంచి స్వామీజీగా పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మాత్రం అభివృద్ధి బాటలో నడిపిస్తానని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం పెద్దలు.. ఎంపీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని…
Annamalai: ద్రవిడ రాజకీయాల్లో జాతీయవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు కే అన్నామలై. బీజేపీకి తమిళనాడులో అన్నామలై ఒక తురుపుముక్కగా ఉన్నారు. అన్నాడీఎంకే మాజీ చీఫ్ జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించే దిశగా ఈ యాంగ్రీయంగ్ మ్యాన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. 39 ఏళ్ల ఈ మాజీ ఐపీఎస్ అధికారికి బీజేపీ అధిష్టానం పూర్తిగా స్వేచ్ఛనిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నామలై లోక్‌సభ అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి లోక్‌సభ…
దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జోస్యం చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ వేదిగకా మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కాశ్మీర్‌లో ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించబోతోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారీ తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నాటికి అందిన లెక్కల ప్రకారం.. మొత్తం 96.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 21.5 కోట్ల మంది వ్యక్తులు కేవలం 29 ఏళ్లలోపు వారు మాత్రమే ఉన్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ 11 సార్లు విజయం సాధించింది. సీపీఎం రెండుసార్లు, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), వైసీపీ, బీఆర్‌ఎస్…