ఇండియా కూటమి కలిసి ఉన్నట్లు మనకు కనిపించడం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భవిష్యత్ అంధకారం కాబోతుందన్నారు. అలాగే, 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండబోదన్నారు. చాలా మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడనున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ క్షీణతకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత కూడా హస్తం పార్టీ నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు.
Read Also: SRH vs MI: నగరానికి చేరుకున్న ముంబై, హైదరాబాద్ టీమ్స్.. ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్!
ఇక, అస్సాం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 25025లో బీజేపీలో చేరతారని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జోస్యం చెప్పుకొచ్చారు. అలాగే, భూపేన్ కోసం నేను రెండు సీట్లు రెడీ చేసి పెడతాను అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లోని తృణమూల్ సభ్యులందరూ మాతో చేరనున్నారు.. నేను సోనిత్ పూర్ అభ్యర్థికి ఫోన్ చేస్తే.. తప్పకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతాడు.. కానీ అలా చేయను. ఇప్పుడు అస్సాంలో మన ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్ లాంటిది.. అవసరమైనప్పుడు తీసుకోవచ్చని సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.