Hyderabad: ఎల్‌బీస్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రచారం జోరు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అటువైపుగా వెళ్లే వాహన దారులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలన్నారు. మోడీ సభ ప్రారంభం నుంచి ముగింపు వరకు రూల్స్ అమల్లో ఉంటాయని తెలిపారు.
READ MORE: Bandi Sanjay: నీ మెడలు వంచి.. ప్రభుత్వాన్ని గద్దె దించింది నేనే.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఎల్‌బీస్టేడియం వరకు వచ్చే సమయంలో పీఎన్‌టీ ఫైఓవర్, గ్రీన్‌లాండ్స్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్‌మార్గ్, తెలుగుతల్లి జంక్షన్, రవీంద్రభారతి రూట్‌లో వాహనాలను అనుమతించరు. సభ పూర్తయిన తర్వాత ప్రధాని ఇదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి వెళ్లే సమయంలో కూడా వాహనాలను అనుమతించరు. ఆ వైపు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటే సరి. సభకు భారీగా జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో వాహనాలను నిలిపేయడంగానీ, దారి మళ్లించడంగానీ చేస్తామని తెలిపారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వాహనాలను అనుమతించరు. సుజాత స్కూల్ వైపు నుంచి లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపునకు వాహనాలను అనుమతించరు. రవీంద్రభారతి వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను పబ్లిక్ గార్డెన్, నాంపల్లి వైపునకు పంపుతారు. ఆయా రూట్లలో ప్రయాణించే వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి రద్దీని నివారించాలని కోరారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!