PM Modi: ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని మోడీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్(గతంలో ట్విట్టర్) అకౌంట్ ద్వారా పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతోందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దరదాపుల్లో కూడా లేవని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ, జాతీయ రాజకీయాలకు సంబంధించిన చాలా అంశాలపై చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్టీవీ ఛానెల్‌కు చెందిన ప్రోమోను ప్రధాని మోడీ ఎక్స్ పోస్ట్‌లో పంచుకున్నారు.
ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం: ఈ లింక్‌ను క్లిక్ చేయండి
There is a BJP wave in Telangana! Congress and BRS are not even in the picture. I discussed a lot of issues relating to Telangana and national politics in this interview with @NtvTeluguLive. Do watch tonight at 8 PM. https://t.co/wTNsmousRQ
— Narendra Modi (@narendramodi) May 10, 2024