Local Body Elections : రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మూడవ విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ విడతలో మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలకు గాను 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాల కోసం మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటాపోటీగా బరిలో నిలిచారు. కాగా, అనివార్య కారణాల వల్ల 11 సర్పంచ్ స్థానాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. Tragedy: “చనిపోవాలని లేదు”.. నా భార్య, ఆమె బాయ్‌ఫ్రెండ్…
Local Body Elections : తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. గురువారం జరగనున్న తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4,236 గ్రామపంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు…
Local Body Elections : రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.…
వరంగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లి గ్రామంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో 375 మంది జనాభా వున్న గ్రామంలో ఎస్టీ జనాభా ఏ ఒక్కరూ లేనప్పటికీ సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ను ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి ఏ ఒక్కరు లేకపోవడంతో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికలు…
పంచాయతీ ఎన్నికలు అక్కడ మిత్రుల మధ్య కొత్త పంచాయితీ పెట్టాయా? ఎక్కడైనా బావేగానీ వంగతోట కాడ కాదన్నట్టుగా ఎవరికి పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్నారా? స్టేట్ పాలిటిక్స్ వేరు, లోకల్ లెక్కలు వేరన్నట్టుగా… ఎక్కడి రాజకీయం నడుస్తోంది? ఏయే పార్టీల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది? Also Read:Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్.. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ ఊపందుకుంది. తొలి విడత పోలింగ్ ఈ నెల 11న జరుగనున్నది. అయితే పలు గ్రామాల్లోని ప్రజలు తమ గ్రామం అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Local Body Elections : తెలంగాణలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో, బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మొత్తం 4,236 గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 22,330 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణలు, బుజ్జగింపుల తరువాత 395 గ్రామాలు ఏకగ్రీవం అయినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటిలో వికారాబాద్ జిల్లా 39 గ్రామాలతో అత్యధిక ఏకగ్రీవాలు నమోదు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 33…
పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్…
Local Body Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతుండగా.. గ్రామ సర్పంచ్ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్తరకపు హామీలతో ముందుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు అభ్యర్థులు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వరాల జల్లుల్లా పథకాలు ప్రకటిస్తుండగా.. మరికొందరు ఏకంగా బాండ్ పేపర్లపై హామీలతో ఓటర్లకు నమ్మకం కల్పిస్తున్నారు. ఈ వినూత్న పోకడలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. IT Raids On Restaurants: ప్రముఖ హోటళ్లపై ఐటీ పంజా..…
TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన…