వరంగల్ జిల్లా సంగెం మండలం వంజర పల్లి గ్రామంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.. గ్రామంలో 375 మంది జనాభా వున్న గ్రామంలో ఎస్టీ జనాభా ఏ ఒక్కరూ లేనప్పటికీ సర్పంచ్, మూడు వార్డు స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ను ఎన్నికల అధికారులు కేటాయించారు. దీంతో గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయడానికి ఏ ఒక్కరు లేకపోవడంతో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు కాలేదు. ఎన్నికలు కేవలం 5 వార్డులకు మాత్రమే జరగనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని వంజరపల్లి గ్రామం చర్చనీయంశంగా మారింది.
Omar Abdullah: ఇండియా కూటమి ‘‘వెంటిలేటర్’’పై ఉంది.. కాంగ్రెస్ పక్షాల ఆగ్రహం, బీజేపీ హ్యాపీ..
నలుగురు వార్డు సభ్యులకు బీసీ ఒకటి, 4 ఎస్సీ కేటాయించడం జరిగింది. ఈ స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామంలో లేని జనాభా కు సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై గ్రామస్తులు ఎన్నికల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వంజనపల్లి గ్రామపంచాయతీ గత ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి బీసీ రిజర్వేషన్లు కేటాయించారు.
ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామంలో సర్పంచ్ తో పాటు మూడు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. అధికారులు రిజర్వేషన్ను మార్చి రీనోటిఫికేషన్ ఇస్తే గ్రామంలో సర్పంచ్ తో పాటు మూడు వార్డు సభ్యుల అభ్యర్థులను ఎన్నుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. రాబోయే రోజుల్లో గ్రామానికి రీ నోటిఫికేషను ఇస్తారా లేదా అధికారులు ఎన్ని నిర్ణయం తీసుకుంటారోనని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
West Bengal: బాబ్రీ మసీదు తరహాలో పశ్చిమ బెంగాల్లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన..