Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మలి విడతలో 192 మండలాల పరిధిలోని 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.. 2,112కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెజారిటీ సీట్లను సాధించడంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తన పట్టును నిలుపుకుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కూడా మలి విడత ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయి. 1, 026కు (25 శాతానికి) పైగా సీట్లలో గెలవడంతో గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. ఇక, బీజేపీకి రెండో విడతలో 225 మంది అభ్యర్థులు గెలిచారు. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ 10 శాతానికి పైగా సీట్లను దక్కించుకున్నాయి.
Read Also: Akhanda2 : ఒంగోలులో అఖండ సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ.. వీడియో వైరల్
అయితే, మలి విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 415 స్థానాలు ఏకగ్రీవం అవగా.. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2,112 స్థానాలను గెలుచుకున్నారు. మలి విడతలో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్సే ఉండడం గమనార్హం. కాగా, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్ సహా 20 జిల్లాల్లో సగానికి పైగా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలిచింది. అయితే, ఏకగ్రీవమైన 415 గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీనే ఉండటం విశేషం.
Read Also: Mokshagna : ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞకు పవర్‌ఫుల్ విలన్ ఫిక్స్?
ఇక, రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ పార్టీ 25 శాతానికి పైగా సీట్లను దక్కించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఊరటే. బీఆర్ఎస్ మద్దతుతో 1,025 అభ్యర్థులు గెలిచారు. మలి విడతలోనూ సిద్దిపేటలో బీఆర్‌ఎస్ హవా కొనసాగింది. ఈ జిల్లాలోని 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 100కు పైగా స్థానాల్లో కారు పార్టీ బలపరిచిన ఘన విజయం సాధించారు. ఇతరులు 36, కాంగ్రెస్ పార్టీ కేవలం 26 సీట్లలో గెలిచింది. సిద్ధిపేట నియోజకవర్గంలోని 91 పంచాయతీల్లో 78 బీఆర్‌ఎస్ గెలవడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. జనగామ జిల్లాలో కాంగ్రెస్ 30 సర్పంచ్ సీట్లను గెలిచింది. బీఆర్‌ఎస్ 37 సీట్లను దక్కించుకుంది. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు 24, బీఆర్‌ఎస్ కు 40 స్థానాల్లో గెలిచింది.
Read Also: Balakrishna: ఇది దేవుడు పెట్టిన పరీక్ష.. సినిమా గురించి ప్రపంచం కోడై కూస్తుంది..!
కాగా, రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ.. మలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 225కి పైగా సీట్లలో విజయం సాధించారు. బీజేపీ గెలుచుకున్న సీట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతినిత్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలవే ఉండటం గమనార్హం. నిర్మల్ జిల్లాలో బీజేపీ హవా కొనసాగింది. 53 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు గెలిస్తే, 46 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కేవలం మూడు స్థానాలకే పరిమితం అయింది. అలాగే, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ 81 సీట్లలో విజయం సాధించగా.. బీఆర్ఎస్ 26 స్థానాల్లో గెలిచింది. ఇక, ఇక్కడ బీజేపీ ఖాతా ఓపెన్ చేయలేదు. అంటే రెండో విడత ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కమలం పార్టీ వాటా కేవలం 6 శాతమే అని చెప్పాలి.