బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేయదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో సామాజిక న్యాయం సాధన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 9ను విడుదల చేసింది.
నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు..…
Off The Record: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. వచ్చే సంక్రాంతి తర్వాత మున్సిపాలిటీలు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు దశల వారీగా జరుగుతాయి. ఇప్పటిదాకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బ్యాలెట్ పద్ధతిలోనే జరగ్గా… తొలిసారి ఈవీఎంల వినియోగం గురించి ఆలోచిస్తోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో విస్తృ చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం 80 శాతం స్థానిక సంస్థలు వైసీపీ చేతిలోనే ఉండడంతో వీలైనంత త్వరగా.. ఎన్నికలు జరిపి…
అసలు, సొల్యూషన్ ఈవీఎంలది కాదు అన్నారు.. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ వస్తే న్యాయబద్ధంగా ఎన్నిక జరుగుతుందన్నారు.. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర భద్రతా బలగల పర్యవేక్షణ ఉంటుందన్నారు.. అప్పుడు ఎలాంటి మెకానిజం తీసుకువచ్చిన ఇబ్బంది లేదు అన్నారు.. అయితే, పేపర్ బ్యాలెట్ అయితే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్కు సిద్ధం కావాలంటూ... ఒక షెడ్యూల్తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి....ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది.
తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే వారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, కీలక నిర్ణయాల కోసం కసరత్తు ప్రారంభించింది.
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.
Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా స్థాయిలో సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది వివరాలు, మరియు ఇతర సామగ్రికి సంబంధించిన సమాచారాన్ని…