కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అయిందని.. రోజుకో శాఖను తాను పరిశీలిస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.
పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మీ పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మీ పథకానికి కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
ట్విట్టర్( X) వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మొత్తాన్ని మోసం చేశావని, మీ “గ్యారంటీలు” చక్కటి ముద్రణ , ఖాళీ వాగ్దానాలతో నిండి ఉన్నాయి. మీరిచ్చిన గ్యారంటీ కార్డు లో షరతులు వర్తిస్తాయని విషయం తెలంగాణ అమాయక ప్రజలకు తెలియదన్నారు బండి సంజయ్.
Minister Atchannaidu: అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్‍లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ ఎస్ఎల్బీసీ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు, నాబార్డు అధికారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా మహిళల సహకారం కనిపిస్తుంది. అయితే.. దేశంలో ఒక మహిళ ప్రారంభించిన బ్యాంకు ఉంది. అది కేవలం మహిళలచే నిర్వహించబడుతుంది. ఈ బ్యాంకు మహిళల అభ్యున్నతి కోసం, బ్యాంకింగ్ రంగానికి అనుసంధానం చేయడం కోసం ప్రారంభించారు. ఈ బ్యాంక్ 1998లో స్థాపించారు.. ఆ తర్వాత సంవత్సరం RBI నుండి లైసెన్స్ పొందింది.
Kamareddy: బ్యాంక్ నుంచి ఎవరైనా లోన్ తీసుకుని తిరిగి కట్టని పక్షంలో అధికారులు వాళ్లకు నోటీసులు జారీ చేస్తారు. ఆ నోటీసులు కూడా తీసుకోకపోతే ఇంటికి వెళ్లి నోటీసును డోర్‌కు అంటిస్తారు.
ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. ఆన్లైన్లో లావాదేవీలు ఎక్కువ అయ్యాయి.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో ఎక్కువగా యూపిఐ పేమెంట్స్ ద్వారా డబ్బులను పంపిస్తున్నారు.. ఇకపోతే ఈ యాప్స్ లోన్స్, క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో యాప్స్ అప్పులు ఇస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.. ఇప్పటికే వాట్సాప్ ఇలాంటి సేవలను ఆందించగా ఇప్పుడు గూగుల్ పే యాప్ కూడా ఈ జాబితాలోకి చేరింది.. చిరు…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ యధాతథంగా కొనసాగిస్తూ వెల్లడిచింది. కానీ, అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్’ వివిధ రుణాలపై బేస్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. MCLR ( బెంచ్ మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ ) పది బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది.
వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఫెస్టివల్ టైంలో టీవీ-ఫ్రీజ్-వాషింగ్ మెషిన్ వరకు వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా, బ్యాంకులు తగ్గింపు వడ్డీ రేట్లతో, జీరో ప్రాసెసింగ్ ఫీజుల ఆఫర్‌లను కూడా అమలు పరుస్తాయి.
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది. అయితే సీఎం కేసీఆర్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఇవాళ (సోమవారం) ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది.