ఈ మధ్య డిజిటల్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. ఆన్లైన్లో లావాదేవీలు ఎక్కువ అయ్యాయి.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో ఎక్కువగా యూపిఐ పేమెంట్స్ ద్వారా డబ్బులను పంపిస్తున్నారు.. ఇకపోతే ఈ యాప్స్ లోన్స్, క్రెడిట్ కార్డులను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.. ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో యాప్స్ అప్పులు ఇస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి.. ఇప్పటికే వాట్సాప్ ఇలాంటి సేవలను ఆందించగా ఇప్పుడు గూగుల్ పే యాప్ కూడా ఈ జాబితాలోకి చేరింది.. చిరు వ్యాపారులకు లోన్ ఈజీగాపొందే అవకాశాన్ని అందిస్తుంది..
గూగుల్ పే యాప్‌లో సులభమైన పద్ధతిలో రుణాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. ఈ విధానంలో యూజర్లు రూ. 10 వేల నుంచి లోన్స్ పొందొచ్చు. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభంగా, నచ్చిన నెలవారీ మొత్తంలో చెల్లించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం గూగుల్ పే డీఎమ్‌ఐ ఫైనాన్స్‌తో కలిసి సాచెట్ లోన్ పేరుతో కొత్త రుణాలను అందిస్తుంది. రూ. 10,000 నుంచి రూ. 1 లక్షల వరకు రణం పొందొచ్చు. ఇక తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఏడు రోజుల నుంచి 12 నెలల వరకు వాయిదాల్లో చెల్లించవచ్చు.
గూగుల్ పే యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా సింపుల్ స్టెప్స్‌తో ఈ రుణాన్ని పొందొచ్చు. ఇక తక్కు మొత్తంలో ఈఎమ్‌ఐని కూడా వినియోగదారులు తమకు నచ్చిన ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పించనున్నారు.. వ్యాపారులకు సులువుగా లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే నెలకు ఆదాయం రూ. 30 వేలు ఉన్నవారికి ఈ లోన్ ను ఇస్తున్నారు. ప్రస్తుతం టైర్ 2 సిటీల్లో గూగుల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.. మరికొద్ది రోజుల్లో ఈ లోన్ ను అందరికీ అందించనున్నారు..